Doctors: జగన్‌కు 9 కుట్లు వేశాం.. ఆయన ధైర్యంగా ఉన్నారు: వైద్యులు

  • 3 నుంచి 4 సెం.మీ.ల లోతులో గాయం
  • ఆరోగ్యం నిలకడగానే ఉంది
  • ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలో చెప్పలేం

వైసీపీ అధినేత జగన్‌కు శస్త్ర చికిత్స చేసినట్టు సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్నం జగన్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి తమ వైద్య సిబ్బంది సాయంతో ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు తెలిపారు.

జగన్ కండరానికి 3 నుంచి 4 సెం.మీ.ల లోతులో గాయమైందని వారు వెల్లడించారు. 9 కుట్లు వేశామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కత్తికి విషం ఉందో లేదో తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షలకు పంపించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి జగన్ ధైర్యంగా ఉన్నారని, అయితే ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడే వెల్లడించలేమన్నారు.

Doctors
Jagan
Operation
Shamshabad Airport
  • Loading...

More Telugu News