Jagan: జగన్ పై దాడి జరిగిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా: కేవీపీ రామచంద్రరావు

  • ప్రజాస్వామ్యవాదులంతా దాడిని ఖండించాలి
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న కేవీపీ
  • కుట్ర కోణం ఉందేమో అనే దిశగా దర్యాప్తు చేయాలి

వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కత్తితో దాడి చేశారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఇలా జరగడం దారుణమని, ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాడిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందిస్తూ, దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్ పోర్టులో ఈ దాడి జరగడం దారుణమని అన్నారు. ఈ దాడి వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందా? అనే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 

Jagan
stab
attack
raghuveera reddy
kvp ramachandra rao
congress
  • Loading...

More Telugu News