rajani: '2.ఓ' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది

  • తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో '2.ఓ'
  • నవంబర్ 3వ తేదీన ట్రైలర్ విడుదల
  • వచ్చేనెల 29న సినిమా విడుదల  

శంకర్ దర్శకత్వంలో రజనీ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా '2.ఓ' సినిమా నిర్మితమైంది. ఈ సినిమా కోసం ఇటు రజనీ అభిమానులు ... అటు అక్షయ్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నవంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 3వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ ట్రైలర్ తో ఈ  సినిమాపై అమాంతంగా అంచనాలను పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసేలా ఈ ట్రైలర్ ను కట్ చేస్తున్నారట. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా ఎమీ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే.     

  • Loading...

More Telugu News