jagan: జగన్ పై దాడి చేసిన నా తమ్ముడు ఆయన అభిమానే!: స్పష్టం చేసిన శ్రీనివాస్ అన్న

  • నా తమ్ముడు చాలా మంచోడు
  • ఎలాంటి నేర చరిత్ర లేదు
  • 10 వ తరగతి చదివి, ఆ తర్వాత ఐటీఐ చేశాడు'

వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ఈ దాడి చేశాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్న సుబ్బరాజు ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించాడు.

'నా తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచి వాడు. జగన్ కు అభిమాని. ఎలాంటి గొడవలు కూడా పడేవాడు కాదు. ఎలాంటి నేర చరిత్ర లేదు. జగన్ పై నా తమ్ముడు దాడి చేశాడంటే నమ్మలేకపోతున్నాం. సెల్ఫీ దిగుతానని చెప్పి, దాడి చేసినట్టు టీవీలో చూశాం. నా తమ్ముడు 10 వ తరగతి చదివి, ఆ తర్వాత ఐటీఐ చేశాడు' అని చెప్పాడు.

jagan
stab
attack
sriniva
fan
  • Loading...

More Telugu News