jagan: వైసీపీ అధినేత జగన్ పై చాకుతో దాడి.. విశాఖ విమానాశ్రయంలో కలకలం!

  • విజిటర్స్ లాంజ్ లో జగన్ పై దాడి
  • సెల్ఫీ దిగుతానంటూ దగ్గరకు వచ్చి, దాడి
  • ప్రథమ చికిత్స చేయించుకుని, హైదరాబాదు బయల్దేరిన జగన్

వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగింది. విశాఖ ఎయిర్ పోర్టులోని వెయిటర్స్ లాంజ్ లో కోడిపందేలకు ఉపయోగించే కత్తితో జగన్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. భుజంపై కత్తితో గాయపరిచాడు. వైసీపీకి 160 సీట్లు వస్తాయా సార్? అంటూ జగన్ ను పలుకరించిన దుండగుడు... సెల్ఫీ దిగుతానంటూ దాడికి దిగాడు. జరిగిన ఘటనతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు జగన్ అక్కడే ప్రథమ చికిత్స చేయించుకుని, అనంతరం, విమానంలో హైదరాబాదుకు బయల్దేరారు. దాడి ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సివుంది. 

jagan
attact
knife
visakhapatnam
airport
  • Loading...

More Telugu News