cetral team in srikakulam: శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర బృందం...తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
- కలెక్టరేట్‌కు చేరుకున్న ఎనిమిది మంది సభ్యులు
- తొలుత దెబ్బతిన్న ప్రాంతాల ఫొటో ప్రదర్శన తిలకింత
- అనంతరం కలెక్టర్ నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశం
శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేడు జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఎనిమిది మంది సభ్యులున్న ఈ బృందం నేరుగా కలెక్టరేట్‌కు వచ్చింది. బాధిత ప్రాంతాల్లో జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టేలా అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన చిత్రమాలికను తిలకించారు.
అనంతరం కలెక్టర్ ధనుంజయరెడ్డి నేతృత్వంలో ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం బృందం సభ్యులు తుపాన్ కారణంగా జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన టెక్కలి, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, పలాస, సంతబొమ్మాళి, మందస, మెళియాపుట్టి, కంచిలి, సోంపేట మండలాల్లో క్షేత్ర స్థాయి పర్యటన జరుపుతారు. నష్టం ప్రభావాన్ని అంచనా వేస్తారు.