keerti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఇది స్పెషల్ మూవీ అంటున్న కీర్తి
- రైతు పాత్ర పోషిస్తున్న సూర్య
- స్పై థ్రిల్లర్ మూవీలో జాహ్నవి
* ఇటీవల విడుదలైన 'పందెం కోడి 2' తన కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమా అంటోంది కథానాయిక కీర్తి సురేశ్. 'అవును, మహానటి వంటి క్లాసిక్ తర్వాత దానికి పూర్తి భిన్నంగా ఇందులో మాస్ క్యారెక్టర్ చేశాను. చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాను. ఇప్పుడు హిట్ కూడా అవడంతో మరింత ఆనందంగా వుంది. అందుకే ఇది నా కెరీర్లో ఓ స్పెషల్ మూవీ' అని చెప్పింది కీర్తి.
* తమిళ హీరో సూర్య తాజాగా రైతు పాత్రలో నటిస్తున్నాడు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య 'NGK' (నంద గోపాలన్ కుమరన్) చిత్రంలో నటిస్తున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య రైతు పాత్రలో కనిపిస్తాడట.
* 'ధడక్' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించింది. వరుణ్ ధావన్ హీరోగా నటించే స్పై థ్రిల్లర్ లో జాహ్నవి హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తాడు.