Sukumar: సమంత వచ్చాక చైతు, నేను కలవలేకపోతున్నాం: సుకుమార్

  • ‘సవ్యసాచి’ ట్రైలర్‌ను విడుదల చేసిన సుకుమార్
  • ఇలాంటి కాన్సెప్ట్ ఇండియన్ స్క్రీన్‌పై రాలేదు
  • ‘100% లవ్’ తర్వాత తరచూ కలిసేవాళ్లం

‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందజేసిన దర్శకుడు సుకుమార్ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన ‘సవ్యసాచి’ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు సుకుమార్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సినిమా తాను చేయనందుకు జెలసీ ఫీలవుతున్నానన్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి కాన్సెప్ట్ ఇండియన్ స్క్రీన్‌పై రాలేదని.. ఏ దర్శకుడికైనా ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా చేయాలనుంటుందని సుక్కు అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన కీరవాణిని ప్రశంసలతో ముంచెత్తారు. 100 పర్సెంట్ లవ్ సినిమా తర్వాత చైతూ, తను తరచూ కలిసేవాళ్లమని, సమంత వచ్చాక మాత్రం అది సాధ్యపడట్లేదని సుకుమార్ నవ్వుతూ అన్నారు. ఇక ఈ చిత్రంలో చైతు అద్భుతంగా నటించాడని.. క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని సుక్కు అన్నారు.

Sukumar
Samantha
Naga Chaitanya
Savyasachi
Chandu Mondeti
  • Loading...

More Telugu News