Revanth Reddy: రేవంత్ కు భద్రత విషయమై కేంద్రాన్ని, ఈసీని ప్రశ్నించిన హైకోర్టు

  • రేవంత్ కు భద్రత దరఖాస్తును పట్టించుకోని కేంద్రం, ఈసీ
  • హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
  • సంబంధిత వివరాలను అందించాలని కేంద్రం, ఈసీకి ఆదేశం 

కేంద్ర సిబ్బంది లేదా స్వతంత్ర సంస్థతో తనకు భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు, ఈసీకి టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వారు స్పందించకపోవడంతో హైకోర్టును ఇటీవల ఆయన ఆశ్రయించారు. ఈ అభ్యర్థనపై హైకోర్టు స్పందించింది.

పిటిషనర్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదంటూ కేంద్ర హోం శాఖను, ఈసీని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన వివరాలు అందించాలని కేంద్రం, ఈసీ తరపు న్యాయవాదులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా, తనకు రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో ప్రమాదం పొంచి ఉన్నందున నలుగురు సిబ్బందితో తనకు భద్రత కల్పించాలని రేవంత్ తన దరఖాస్తులో కోరారు.

Revanth Reddy
High Court
ec
home ministry
  • Loading...

More Telugu News