Susi Ganeshan: దర్శకుడు సుశీ గణేశన్, అతని భార్య ఫోన్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడారు: అమలాపాల్

  • సుశీ గణేశన్ తనను వేధించారన్న లీనా
  • లీనా ఆరోపణలను సమర్థిస్తూ అమల పోస్ట్
  • వ్యక్తిత్వాన్ని తప్పుబట్టారంటున్న అమల

  ప్రముఖ తమిళ దర్శకుడు సుశీ గణేశన్ తనను వేధించినట్టు ఇటీవల దర్శకురాలు లీనా మీడియా ద్వారా వెల్లడించారు. లీనా ఆరోపణలను సమర్థిస్తూ నటి అమలాపాల్ గతంలో సుశీ గణేశన్ తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించారని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే అమలాకు సుశీ గణేశన్, అతని భార్య మంజరి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారట. ఈ విషయాన్ని పేర్కొంటూ, తన వ్యక్తిత్వాన్ని వారు తప్పుబట్టారంటూ అమల ట్విటర్ ద్వారా వెల్లడించింది. లీనాకు పూర్తి మద్దతిస్తున్నానని.. ఆమె పట్ల సుసి గణేశన్ ఎలా ప్రవర్తించి ఉంటాడో ఊహించగలనని పోస్టులో పేర్కొంది.

 సుశీ గణేశన్ దర్శకత్వంలో తాను ‘తిరుటుపాయలే 2’ చిత్రంలో నటించానని ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ధైర్యంగా తన సమస్యలను బయటపెట్టిన లీనాను అభినందించింది. ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే అమలాకు సుశీ గణేశన్, మంజరి ఫోన్ చేశారట. తాను చెబుతున్నది వినకుండా, మంజరి నోటికొచ్చినట్టు మాట్లాడారని.. వెటకారంగా నవ్వుతూ తన వ్యక్తిత్వాన్ని తప్పుబట్టారని అమల తెలిపింది. ఇలాంటి వారితో తనను బెదిరించాలనుకుంటున్నారేమో అని అమలాపాల్ ట్వీట్‌లో పేర్కొంది.


Susi Ganeshan
Leena
Manjari
Amala Paul
Thirutupayale 2
  • Loading...

More Telugu News