mahakutami: డిసెంబర్ 11న మహాకూటమి గూబ గుయ్ మంటుంది: మంత్రి కేటీఆర్

  • తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం లేదు
  • డిసెంబర్ 11న కచ్చితంగా శబ్ద విప్లవం ఉంటుంది
  • అధికారంలోకి టీఆర్ఎస్ రావడం ఖాయం

తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం ఉందని, డిసెంబర్ 11న తేలిపోతుందని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వేములవాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం లేదని, డిసెంబర్ 11న కచ్చితంగా శబ్ద విప్లవం ఉంటుందని, మహాకూటమి గూబ గుయ్ మనేట్టు ఎన్నికల ఫలితాలు వస్తాయని, అధికారంలోకి టీఆర్ఎస్ వస్తుందని అన్నారు.

 అరవై ఏడేళ్లు తెలంగాణ ప్రజలను కాల్చుకుతిన్నవాళ్లు మళ్లీ ఒక్కటై మనముందుకొస్తున్నారని, వాళ్లకు ఎలాంటి గుణపాఠం చెప్పాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. ఒకవేళ కర్మ కాలి మహాకూటమి అధికారంలోకొస్తే తెలంగాణ ప్రజల జుట్టు చంద్రబాబునాయుడు చేతుల్లో ఉంటుందని, రాష్ట్రంలో ఒక ప్రాజెక్టైనా ముందుకు పోనిస్తాడా? ఒక్క రైతుకైనా న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందా? అని ప్రశ్నించారు.

mahakutami
minister KTR
vemulavada
  • Loading...

More Telugu News