Chandrababu: గడ్డం చంద్రబాబునాయుడు.. గడ్డం ఉత్తమ్ కుమార్ రెడ్డీ ఒకటవుతున్నారు!: కేటీఆర్

  • తెలంగాణకు అడ్డంపడ్డ గడ్డాలన్నీ ఒకటవుతున్నాయి
  • ఒక ముసలి నక్క కాంగ్రెస్.. గుంటనక్క చంద్రబాబు 
  • ఇద్దరూ ఒక్కటై మన కొంపలు ముంచుతారట

కాంగ్రెసోళ్లకు యాభై ఏళ్లు, టీడీపీ వాళ్లకు పదిహేడేళ్లు అవకాశమిచ్చినా తెలంగాణకు చేయని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో తాము చేసి చూపించామని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆ అరవై ఏడేళ్లలో ఆ రెండు పార్టీలు ఏం చేశాయో ప్రజలకు తెలుసని అన్నారు.

‘గమ్మత్తేమిటంటే.. తెలంగాణకు అడ్డంపడ్డ గడ్డాలన్నీ ఒకటవుతున్నాయి. గడ్డం చంద్రబాబునాయుడు.. గడ్డం ఉత్తమ్ కుమార్ రెడ్డీ ఇద్దరూ ఒకటవుతున్నారు. గతంలో అడ్డంపడ్డారు. మళ్లీ అవే గడ్డాలు తెలంగాణకు గండంగా వస్తున్నాయి. ఒక ముసలి నక్క కాంగ్రెస్.. గుంటనక్క చంద్రబాబునాయుడు.. ఇద్దరూ ఒకటవుతున్నారు. ఇద్దరూ ఒక్కటై మన కొంపలు ముంచుతారట. కేసీఆర్ ను ఓడించే వరకూ ఊరుకోరట. ‘కేసీఆర్ ను ఎందుకు ఓడించాలి? అరవై ఏడేళ్లలో మీరు చేయని పనులు నాలుగేళ్లలో మేము చేసినందుకా?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.   

Chandrababu
Uttam Kumar Reddy
KTR
vemulavada
  • Loading...

More Telugu News