Tirumala: తిరుమలలో వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనం వేళల కుదింపు!

  • బుధవారం ప్రత్యేక దర్శనం ఒక్క స్లాట్ కే పరిమితం
  • 10 గంటల స్లాట్ తొలగిస్తున్నట్టు ప్రకటన
  • 3 గంటల స్లాట్ లో అదనంగా 300 టికెట్లు

వయో వృద్ధులు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం దుర్వార్త చెప్పింది. స్వామి దర్శనానికి వెళ్లే 60 సంవత్సరాలు దాటిన భక్తులు, వికలాంగులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను కుదించింది. ఇకపై ప్రతి బుధవారం ఒకే స్లాట్ లో మాత్రమే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం ఉంటుందని, ఉదయం 10 గంటల స్లాట్ ను తొలగిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో ప్రస్తుతం ఇస్తున్న 700 టోకెన్లకు బదులుగా 1000 టోకెన్లు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలియజేసింది. 

Tirumala
Tirupati
TTD
Phisically Handicapped
Senior Citizen
  • Loading...

More Telugu News