Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం కాళ్లపై పడి నమస్కరించిన చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి!

  • త్వరలో చత్తీస్ గఢ్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • రాజ్ నంద్ గావ్ నుంచి పోటీ చేయనున్న రమణ్ సింగ్
  • నామినేషన్ సందర్భంగా ఘటన

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి నమస్కరించారు చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్. చత్తీస్ గఢ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాజ్ నంద్ గావ్ నియోజకవర్గం నుంచి రమణ్ సింగ్ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన వేళ, ఈ ఘటన జరిగింది. తనకన్నా దాదాపు 20 సంవత్సరాలు చిన్నవాడైన ఆదిత్యనాథ్ కు రమణ్ సింగ్ పాదాభివందనం చేయడం గమనార్హం. కాగా, రమణ్ సింగ్ పై రాజ్ నంద్ గావ్ నుంచి కాంగ్రెస్ తరఫున వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా బరిలోకి దిగనుండటంతో, ఈ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది.

Uttar Pradesh
Chattisghad
Raman Singh
Yogi Adityanath
Elections
  • Loading...

More Telugu News