Josaph: సెల్‌ఫోన్ విషయంలో విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరి మృతి!

  • తీవ్రంగా గాయపడిన జోసఫ్
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
  • అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించిన వైద్యులు

సెల్‌ఫోన్ విషయంలో చిన్నారుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ గిరిజన పాఠశాలలో సెల్‌ఫోన్ విషయంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో చిన్నారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ విషయం వెళ్లింది.

ఈ ఘటనలో జోసఫ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది జోసఫ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. జోసఫ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Josaph
4Th class Students
Cell Phone
Hostel warden
Dead
  • Loading...

More Telugu News