Casting Couch: వైరముత్తు అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు.. అందుకు ఏఆర్ రెహమాన్ పేరును కూడా వాడుకున్నాడు!: రెహమాన్ సోదరి రెహానా

  • ఈ విషయాలు రెహమాన్ కు తెలియవు
  • ఆరోపణలు రాగానే నన్ను అడిగాడు
  • వైరముత్తు వ్యవహారాలన్నీ బయటపెట్టాను

తమిళ గీత రచయిత వైరముత్తు అమ్మాయిలను లైంగికంగా వేధించేవాడని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోదరి రెహానా ఆరోపించారు. ఆయన వ్యవహారాలపై చాలా విషయాలు తాను విన్నానని చెప్పారు. యువ గాయనీమణులను ట్రాప్ చేసేందుకు తన సోదరుడు ఏఆర్ రెహమాన్  పేరును సైతం వాడుకున్నాడని ఆరోపించారు. ఈ విషయాలేవీ తన సోదరుడికి తెలియవని అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వైరముత్తు వ్యవహారంపై మాట్లాడారు.

వైరముత్తు వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలను తాను నమ్ముతున్నట్లు రెహానా అన్నారు. ఈ విషయం బయటకు రాగానే ‘ఇది నిజమేనా?’ అని అడిగాడనీ, దీంతో వైరముత్తుపై వచ్చిన ఆరోపణల గురించి రెహమాన్ కు చెప్పినట్లు ఆమె తెలిపారు. మీటూ ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Casting Couch
kollywood
vairamuttu
tamil
song writer
sripada chinmayee
sexual harrasment
AR REHAMANA
  • Loading...

More Telugu News