Bollywood: హౌస్ ఫుల్-4లో రానా దగ్గుబాటి.. నానా పటేకర్ కు బదులుగా నటించే ఛాన్స్!
- బాలీవుడ్ ను తాకిన ‘మీ టూ’ సెగ
- ప్రాజెక్టు నుంచి తప్పుకున్న నానాపటేకర్
- త్వరలోనే షూటింగ్ ప్రారంభం
సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో లైంగిక వేధింపులపై మొదలైన మీటూ ఉద్యమం ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సుభాష్ ఘయ్, గీత రచయిత వైరముత్తు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళలు ముందుకొచ్చి చెప్పారు. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నానా పటేకర్ హౌస్ ఫుల్-4 సినిమా నుంచి తప్పుకున్నాడు. అతనితో పాటు దర్శకుడు సాజిద్ ఖాన్ కూడా ఈ భారీ ప్రాజెక్టుకు టాటా చెప్పాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో హౌస్ ఫుల్-4 ప్రాజెక్టు ఇటీవల ఆగిపోయింది. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దర్శకుడిగా సాజిద్ ఖాన్ స్థానంలో ఫర్హాద్ సంజనీని తీసుకునేందుకు నిర్మాతలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక నానాపటేకర్ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే రానా ప్రతినిధితో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్.