peddi reddy: సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి ఉన్నా.. అంతా సర్దుకుంటుంది: టీడీపీ నేత పెద్దిరెడ్డి

  • ఈ నెల 27న మహాకూటమి తొలి జాబితా
  • నవంబర్ 1 లోగా పూర్తి స్థాయి జాబితా
  • ఎన్ని సీట్లు కేటాయించినా కూటమి గెలుపు కోసం కృషి చేస్తాం

ఈ నెల 27వ తేదీన మహాకూటమి తొలి జాబితాను విడుదల చేస్తామని... నవంబర్ 1వ తేదీలోగా పూర్తి స్థాయి జాబితా వస్తుందని టీటీడీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. సీట్ల పంపకాల విషయంలో కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు వస్తాయని టీఆర్ఎస్ ఎదురు చూస్తోందని అన్నారు. సీట్ల సర్దుబాటు అంశంలో కొంత అసంతృప్తి ఉన్నా, అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. టీడీపీకి ఎన్ని సీట్లు కేటాయించినా మహాకూటమి గెలుపుకు కృషి చేస్తుందని అన్నారు. కూటమి సభలతో పాటు తమ పార్టీ అభ్యర్థుల తరపున కూడా చంద్రబాబు ప్రచారం చేస్తారని చెప్పారు. పార్టీలో సీట్ల కోసం ఎలాంటి లాబీయింగ్ జరగడం లేదని తెలిపారు. 

peddi reddy
tTelugudesam
mahakutami
telangana
  • Loading...

More Telugu News