Sahoo: ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో గిఫ్ట్... రియల్ స్పీడ్, రియల్ యాక్షన్... 'షేడ్స్ ఆఫ్ సాహో' వీడియో విడుదల!

  • అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చిన 'సాహో' యూనిట్
  • అదరగొడుతున్న అబూదాబి ఫైట్ మేకింగ్ వీడియో
  • వీడియోకు సంగీతాన్ని అందించిన థమన్

నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు మరో ట్రీట్ లభించింది. 'షేడ్స్ ఆఫ్ సాహో' అంటూ 'సాహో' నుంచి ప్రభాస్ తాజా లుక్ ను విడుదల చేసిన టీమ్, అదే పేరిట అదిరిపోయే వీడియోనూ విడుదల చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని ఈ వీడియో చూపిస్తోంది.

హాలీవుడ్ నిపుణులను రంగంలోకి దించిమరీ షూట్ చేసిన ఫైట్ సీన్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలను, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అబుదాబిలో ఈ చిత్రం షూటింగ్, కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వీడియోకు థమన్ సంగీతం అందించాడు. 'సాహో' కు మాత్రం శంకర్ ఈశన్ లాయ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. నిమిషాల వ్యవధిలో లక్షల వ్యూస్ సాధించి, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూడండి.

Sahoo
Prabhas
Birthday
Fans
Shads of Shadow
  • Error fetching data: Network response was not ok

More Telugu News