Sabarimala: భక్తుల విజయం... శబరిమలపై రివ్యూ పిటిషన్ కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు!

  • రివ్యూ పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం
  • ఎప్పటి నుంచి విచారించాలన్న విషయమై నేడు నిర్ణయం 
  • కోట్లాది మంది భక్తుల విజయమన్న శివసేన

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసు మహిళలనూ అనుమతించాలని తాము గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. పలువురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం, ఎప్పటి నుంచి విచారణ జరపుతామన్న విషయాన్ని నేడు ప్రకటించనుంది. మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ శబరిమల, పంబ, పథనంతిట్ట, ఎర్నాకులం, తిరువనంతపురం, కొచ్చి తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పలువురు యువతులను ఆలయం వరకూ మాత్రమే చేర్చగలిగిన పోలీసులు, వారిని పద్దెనిమిది మెట్లను మాత్రం ఎక్కించలేకపోయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తన తీర్పుపై రివ్యూ పిటిషన్ ను స్వీకరించడం భక్తుల విజయమని శివసేన ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

Sabarimala
Review
Petition
Supreme Court
  • Loading...

More Telugu News