Venkaiah Naidu: ఇంగ్లిష్‌ను కళ్లద్దాలతో పోల్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య
  • ప్రతి ఒక్కరు మాతృభాషలోనే మాట్లాడాలని పిలుపు
  • పంజాబ్ ప్రజలు ధైర్యవంతులని ప్రశంస

ఆంగ్లభాష కళ్లద్దాల వంటిదని, ప్రతి ఒక్కరు మాతృభాషలోనే మాట్లాడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. జలంధర్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్‌‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య విద్యార్థులకు డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ మాతృభాషలోనే మాట్లాడాలని, కళ్లద్దాల్లాంటి ఆంగ్ల భాషను పక్కన పెట్టాలని కోరారు.

పని ప్రదేశంలో జాతీయ భాష అయిన హిందీలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పంజాబ్ ప్రజల ధైర్య సాహసాలను ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఎవరికీ తలవంచని ధైర్యం పంజాబ్ ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిందన్నారు. ఎంతగానే కష్టపడే ఇక్కడి ప్రజలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఎందరికో ఉపాధి కల్పించడం గర్వించదగ్గ విషయమని వెంకయ్య అన్నారు.

Venkaiah Naidu
vice-president
Mother tongue
Hindi
English
  • Loading...

More Telugu News