sensex: మార్కెట్లకు అమ్మకాల సెగ.. 181 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

  • లాభాలతో ప్రారంభమై నష్టాల్లో ముగిసిన మార్కెట్లు 
  • అక్టోబర్ డెరివేటివ్ లు ముగుస్తుండటం కూడా ఒక కారణం
  • 26 శాతం పైగా నష్టపోయిన ఇన్ఫీబీమ్ అవెన్యూస్

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ... ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. అక్టోబర్ డెరివేటివ్ ల గడువు కూడా ముగియనుండటంతో... సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 181 పాయింట్లు పతనమై 34,134కు పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 10,245 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సుందరం క్లేటన్ లిమిటెడ్ (10.73%), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (9.20%), ముత్తూట్ ఫైనాన్స్ (5.89%), ఏజీస్ లాజిస్టిక్స్ (4.40%), ఇండియన్ హోటల్స్ (4.24%).    
 
టాప్ లూజర్స్:
ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (-26.47%), పెర్సిస్టెంట్ సిస్టమ్స్ (-14.61%), దేవాన్ హౌసింగ్ (-10.25%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-8.52%), సెంచురీ ప్లైబోర్డ్స్ (-8.39%).     

  • Loading...

More Telugu News