: నవ దంపతులతో తిరుమల కళకళ
అరుదైన ముహూర్తం కావడంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా వివాహాలు భారీ సంఖ్యలో జరిగాయి. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల నేడు నూతన వధూవరులతో కళకళలాడింది. తిరుమలలో ఈ ఉదయం 500 వివాహాలు జరిగాయి. ఏడుకొండలవాడి దివ్యక్షేత్రంలో ఈ ఆదివారం ఎటు చూసినా పెళ్ళి దుస్తుల్లో కొత్త జంటలే దర్శనమిచ్చాయి.
కాగా, తమిళనాడు సీఎం జయలలిత ముఖ్య కార్యదర్శి రామ్మోహనరావు కుమార్తె వివాహం కోసం ప్రత్యేకంగా 300కి పైగా గదులను కేటాయించడం వివాదాస్పదమైంది. దీంతొ, గదులకు కొరత ఏర్పడడంతో సామాన్య భక్తులు రోడ్లపైనే బస చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారమై టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు వివరణ ఇస్తూ, మీడియాలో వచ్చే దాకా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు.