revanth redd: మరోసారి ఐటీ అధికారుల విచారణకు హాజరుకానున్న రేవంత్ రెడ్డి

  • రేపు ఉదయం 10 గంటల నుంచి విచారణ
  • ఈ నెల 3న విచారణకు హాజరైన రేవంత్
  • 23న మరోసారి హాజరు కావాలంటూ గతంలో నోటీసులు

ఐటీ అధికారుల విచారణకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రేపు మరోసారి హాజరుకానున్నారు. హైదరాబాద్, బషీర్ బాగ్ లోని ఐటీ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటల నుంచి ఆయనను విచారించనున్నారు. ఈ నెల మూడో తేదీన రేవంత్ ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇక రేపటి విచారణకు రేవంత్ తో పాటు ఆయన అనుచరుడు ఉదయసింహ, మామ పద్మనాభరెడ్డి, శ్రీ సాయి మౌర్య కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేష్ రెడ్డి, శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సైతం హాజరయ్యే అవకాశం ఉంది. 

revanth redd
it
raids
enquiry
  • Loading...

More Telugu News