Congress: 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ కార్యకర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్.. కొద్దిసేపటికే హత్య!

  • హత్యకు పోస్టే కారణమంటున్న మనోజ్ కుమార్
  • పోస్ట్‌పై దూషిస్తూ కామెంట్లు
  • హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

ముంబైలోని ఘట్నోపార్‌ ఏరియాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య కలకలం రేపుతోంది. ఈ హత్యకు కారణం ఓ ఫేస్‌బుక్ పోస్టేనని ఆయన బావమరిది ఆరోపిస్తున్నారు. మనోజ్ దూబే అనే కాంగ్రెస్ కార్యకర్త 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

ఈ పోస్టును దూషిస్తూ బీజేపీ, భజరంగ్ దళ్‌కి చెందిన కొందరు వ్యక్తులు కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ పోస్టుపై ఆగ్రహంతో ఉన్న కొందరు కుర్రాళ్లు దూబేపై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్టు ఆయన బావమరిది మనోజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. దూబే హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దూబే మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించారు.

Congress
Murder
Manoj Kumar
Mumbai
Manoj Dube
BJP
Bhajarangdal
  • Loading...

More Telugu News