arjun: మా నాన్న పబ్ లకే పోడు.. ఇక ఆమెను రిసార్ట్, డిన్నర్ కు రమ్మంటాడా?: నటి శ్రుతిపై హీరో అర్జున్ కుమార్తె ఫైర్

  • శ్రుతి తప్పుడు ఆరోపణలు చేస్తోంది
  • ఆమెకు సొంత లాభాలు ఉన్నాయి
  • స్క్రిప్ట్ లో అభ్యంతరకరమైన సీన్లను ముందే తీసేశాం

నిబుణన్‌ (కన్నడలో విస్మయ) సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ తనను అసభ్యంగా తాకుతూ వేధించాడని శ్రుతి హరిహరన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో సినిమాను ఆపడం ఇష్టంలేక అప్పుడు తాను సైలెంట్ గా ఉండిపోయానని ఆమె వ్యాఖ్యానించింది. కాగా, శ్రుతి ఆరోపణలపై అర్జున్ కుమార్తె ఐశ్వర్య తీవ్రంగా మండిపడ్డారు. సినిమా స్క్రిప్ట్ లో రెండు అభ్యంతరకరమైన సీన్లు ఉంటే, వాటిని తొలగిస్తేనే నటిస్తానని తన తండ్రి కరాఖండిగా చెప్పేశారని ఐశ్వర్య అన్నారు.

తన సినిమా స్క్రిప్ట్ లను తమను కూడా వినమని అర్జున్ చెబుతారన్నారు. సినిమా షూటింగ్ లో శ్రుతి ఐదు రోజులు మాత్రమే పాల్గొన్నారన్నారు.  రిసార్ట్ కు, డిన్నర్ కు రావాలని అర్జున్ ఒత్తిడి చేసినట్లు శ్రుతి చెప్పడంపై ఐశ్వర్య స్పందించారు. తన ఇన్నేళ్ల జీవితంలో తండ్రి అర్జున్ పబ్ కు వెళ్లడాన్ని తానెప్పుడూ చూడలేదని ఐశ్వర్య అన్నారు. అలాంటిది తన తండ్రి రిసార్ట్ కు, డిన్నర్ కు రావాల్సిందిగా వేధించినట్లు శ్రుతి చెప్పడం నమ్మబుద్ది కావడం లేదన్నారు. శ్రుతి హరిహరన్ కేవలం సొంత ప్రయోజనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తోందని ఐశ్వర్య విమర్శించారు. 

arjun
me too
aishwarya
sruti hariharan
personal benefits
wrong allegations
action star
  • Loading...

More Telugu News