sleep disorder: గురక సమస్య ఉన్న వారికి శుభవార్త...హైటెక్‌ రింగ్‌ పెట్టుకుంటే ఇట్టే మాయం

  • గురకతోపాటు నిద్రలేమి సమస్యకు పరిష్కారం చూపిన ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తలు
  • రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ గుర్తించే సెన్సార్ల అమరిక
  • గుండె పోటు సమస్య నుంచి బయట పడేందుకు మార్గం

చూడడానికి చిన్న సమస్యలా అనిపించే ‘గురక’ ప్రాణాంతకమైంది. గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి కారణమయ్యేది. ఆరోగ్యపరంగా ఇది సమస్య అయితే కుటుంబంలో కలతలకూ గురక కారణమవుతోంది. భర్త/భార్యకు గురక సమస్య ఉందన్న కారణంగా ఎన్నో జంటలు విడాకులు తీసుకున్న సందర్బాలున్నాయి. అంతటి ప్రమాదకరమైన గురకకు పరిష్కారంగా లండన్‌ పరిశోధకులు ఓ హైటెక్‌ ఉంగరాన్ని అభివృద్ధి చేశారు.  

సిలికాన్‌తో తయారు చేసిన ఈ ఉంగరంలో రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ గుర్తించే సెన్సార్లను అమర్చారు. నిద్రలో గురక సమస్యకు బ్లడ్‌ ఆక్సిజన్‌ రీడింగ్స్‌ పడిపోవడం సంకేతంగా భావిస్తారు. ఈ ఉంగరం ద్వారా ఆక్సిజన్‌ రీడింగ్‌ను పసిగట్టి వైద్యులకు కీలక సమాచారం అందజేసే వెసులుబాటు ఉంది. ప్రతి మూడు రోజులకోసారి ఈ ఉంగరాన్ని చార్జి చేసుకుంటే సరిపోతుంది.

ముఖ్యంగా ఒంటరిగా ఉంటున్న వారికి ఈ రింగ్‌ ఎంతో ఉపయుక్తమని స్లీప్‌ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ నీల్‌స్టాన్లీ తెలిపారు. దీని ఖరీదు రూ.7500. నిద్రలేమి , గురక సమస్యకు ఈ రింగ్‌ మంచి ఉపశమనమంటున్నారు.

  • Loading...

More Telugu News