Road Accident: యాక్సిడెంట్ తరువాత స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయిన నిర్మాత సురేష్ బాబు

  • ప్రమాద సమయంలో డ్రైవింగ్ సీటులో సురేష్ బాబు
  • కారు వేగం 100 కిలోమీటర్లకు పైగానే
  • కారును స్టేషన్ కు తెచ్చి అప్పగించిన సురేష్ బాబు

ఈ తెల్లవారుజామున సికింద్రాబాద్ సమీపంలోని కార్కానా పరిధిలో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన కారు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కారును సురేష్ బాబు స్వయంగా నడుపుతున్నారని, కారు వేగం గంటకు 100 కిలోమీటర్లకు పైగానే ఉందని పోలీసులు చెబుతున్నారు.

కారు ప్రమాదానికి గురి కాగానే, స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆయనే ఆసుపత్రికి పంపించారని, కారును పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చి అప్పగించి, విషయం చెప్పి, వ్యక్తిగత పూచీకత్తుపై వెళ్లారని కార్కానా పోలీసులు వెల్లడించారు. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేశామని, సాయంత్రం తిరిగి విచారణకు రావాలని కోరామని, దగ్గుబాటి మద్యం తాగి వాహనం నడిపారా? అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు చేయిస్తామని తెలిపారు.

Road Accident
Daggubati Suresh Babu
Tollywood
Police
  • Loading...

More Telugu News