mee too: ఆ దర్శకుడు నా కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించాడు!: హీరోయిన్ సంజన

  • మాట వినకుంటే కెరీర్‌ నాశనం చేస్తానన్నాడు
  • బలవంతంగా కొన్ని అశ్లీల దృశ్యాల చిత్రీకరణ
  • నటిస్తున్న సమయంలో తీవ్రమైన లైంగిక వేధింపులు  

చాలా ఏళ్ల తర్వాత నటి సంజనా గిర్లానీ నోరు విప్పింది. చిత్ర పరిశ్రమలో తీవ్ర లైంగిక వేధింపులకు గురయ్యానని, హిందీ ‘మర్డర్‌’ చిత్రాన్ని కన్నడలోకి రీమేక్‌ చేసిన దర్శకుడు చెప్పినట్టు వినకుంటే ఏకంగా తన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించాడని బాంబ్‌ పేల్చింది. తమిళ, తెలుగు, మలయాళం భాషల్లో నటించిన ఈ అమ్మడు నటి నిక్కీ గర్లానీ సోదరి. ప్లస్‌ వన్‌ చదువుతున్నప్పుడు 15 ఏళ్ల వయసులోనే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఆనాటి కొన్ని సంఘటనలను సంజన తాజాగా బయటపెట్టింది. 'నాకు తొలి సినిమా అవకాశం కన్నడలో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు నాకు హిందీ మర్డర్‌ సినిమా చూపించి దీన్ని కన్నడలోకి రీమేక్‌ చేస్తున్నట్లు చెప్పాడు. ఆ చిత్రంలో కొన్ని సన్నివేశాలు అసభ్యంగా ఉండడంతో నటించనని చెప్పడంతో మార్పుకు అంగీకరించాడు. షూటింగ్‌ కోసం అమ్మతో కలిసి బ్యాంకాక్‌ వెళ్లాను. అక్కడ స్పాట్‌కు అమ్మను తేవొద్దని చెప్పాడు. అక్కడ ముద్దు సన్నివేశమని చెప్పి నన్ను బెదిరించి వాటితోపాటు పలు ఆశ్లీల సన్నివేశాలు చిత్రీకరించాడు' అని సంజన ఆవేదన వ్యక్తం చేసింది.

'చిత్ర పరిశమ్రలోకి ఓ విజన్‌తో వచ్చిన నన్ను ఇష్టానుసారం వాడుకున్నారు, లైంగికంగా వేధించారు' అని ఈ అమ్మడు వాపోయింది.

mee too
sanjana galrani
seexual herasment
  • Loading...

More Telugu News