rama mandir: రామమందిరం నిర్మాణానికి సహకరించకుంటే తీవ్ర పరిణామాలు!: ముస్లింలకు కేంద్ర మంత్రి వార్నింగ్

  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి గిరిరాజ్ సింగ్
  • ముస్లింలు రాముడి వారసులని వ్యాఖ్య
  • ఇద్దరు పిల్లలను మించి కనరాదని వెల్లడి

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నోరుజారారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మద్దతు ఇవ్వకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముస్లింలను హెచ్చరించారు. ముస్లింలు రాముడి వారసులనీ, మొఘల్ రాజుల వారసులు కాదని సెలవిచ్చారు. రామాలయం నిర్మాణానికి మద్దతు ఇవ్వకుంటే హిందువుల ఆగ్రహానికి ముస్లింలు గురవ్వాల్సి వస్తుందని బెదిరించారు. ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రామమందిరం అంశం రెండో స్టేజ్ కేన్సర్ లాగా తయారయిందనీ, ఇప్పుడు కాకుంటే రామమందిర నిర్మాణం ఇంకెప్పుడూ కాదని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజలు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇందుకు ఒప్పుకోని వారి ఓటు హక్కును సైతం రద్దు చేయాలన్నారు.

rama mandir
ayodhya
muslims
warning
giriraj singh
central minister
voting right
  • Loading...

More Telugu News