gopi chand: మా నాన్నకు మంచిపేరు తీసుకురాకున్నా.. చెడ్డపేరు మాత్రం తీసుకురాను!: హీరో గోపీచంద్

  • ప్రకాశం జిల్లాలో తొట్టెంపూడి కృష్ణ వర్ధంతి కార్యక్రమం
  • నిరుపేద విద్యార్థులకు గోపీచంద్ సాయం 
  • తన తండ్రి చరిత్రలో నిలిచిపోయారని వ్యాఖ్య

తన తండ్రి టి.కృష్ణ పేరు నిలబెట్టలేకపోయినా ఆయనకు చెడ్డపేరు మాత్రం తీసుకురానని సినీ హీరో గోపీచంద్ అన్నాడు. ప్రకాశం జిల్లా కేంద్రంలో తొట్టెంపూడి కృష్ణ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గోపీచంద్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చదువులో ప్రతిభ చూపిన 20 మంది విద్యార్థులకు రూ.10,000 చొప్పున రూ.2 లక్షల సాయం అందించాడు

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా గోపీచంద్ బహుమతులు అందజేశాడు. చనిపోయిన 32 సంవత్సరాల తర్వాత కూడా తన తండ్రిని అందరూ గుర్తుంచుకున్నారనీ, అలాంటి వ్యక్తి కడుపున పుట్టడం తన అదృష్టమని గోపీచంద్ చెప్పాడు. తన తండ్రి ఆరు సినిమాలు మాత్రమే చేసినా చరిత్రలో నిలిచిపోయారనీ, ఆయనకు మంచిపేరు తీసుకురాకున్నా, చెడ్డపేరు మాత్రం తీసుకురానని గోపీచంద్ వ్యాఖ్యానించాడు.

గోపీచంద్ తండ్రి తొట్టెంపూడి కృష్ణ.. నేటి భారతం, దేశంలో దొంగలు పట్టారు, వందేమాతరం, దేవాలయం, ప్రతిఘటన, రేపటి పౌరులు వంటి సినిమాలను తెరకెక్కించారు.

gopi chand
Tollywood
Prakasam District
vardhanti
poor students
help
awards
tottempudi krishna
  • Loading...

More Telugu News