Uttar Pradesh: యూపీ స్కూల్‌లో దారుణం.. టీచర్ కొట్టడంతో 8 ఏళ్ల విద్యార్థి మృతి

  • విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి
  • తీవ్ర గాయాలపాలైన బాలుడు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్కూల్‌లో దారుణం జరిగింది. 8 ఏళ్ల విద్యార్థిని టీచర్ విపరీతంగా కొట్టడంతో బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సడిమడన్‌పుట్ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న అర్బాజ్‌ను జైరాజ్ అనే టీచర్ విపరీతంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలై స్పృహ తప్పి పడిపోయిన అర్బాజ్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Uttar Pradesh
School boy
Teacher
Died
beaten
Arrest
  • Loading...

More Telugu News