Madhu Yaskhi: వినోదపన్నుకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ లో సమరం.. 400 థియేటర్ల మూత!

  • 28 శాతం జీఎస్టీకి అదనంగా 15 శాతం వినోదపన్ను
  • ప్రభుత్వ తీరుపై థియేటర్ యాజమాన్యాల నిరసన
  • ఈ నెల 5 నుంచి 400 సినిమా హాళ్ల మూత

మధ్యప్రదేశ్‌లో ఈ నెల 5 నుంచి 400 థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వం విధించిన వినోదపన్నుకు వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధృతం చేసిన థియేటర్ల యజమానులు సినిమా హాళ్లను మూసేశారు. దీంతో ప్రజలకు వినోదం కరువవగా, సినిమా హాళ్లలో పనిచేస్తున్న సిబ్బంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి.

ఇప్పటికే టికెట్లపై 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తుండగా, ఇప్పుడు స్థానిక సంస్థలు వినోదపు పన్ను పేరుతో 5-15 శాతం అదనపు సుంకం విధించడంతో మరో గత్యంతరం లేని థియేటర్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ల మూసివేతతో అందులో పనిచేస్తున్న వారు జీవనాధారాన్ని కోల్పోతున్నారని, ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా స్పందించాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు జితేంద్ర జైన్ కోరారు.

  • Loading...

More Telugu News