jaipur: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కారులో వ్యక్తి సజీవ దహనం!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-a1040f87848bab977b29eb169ff68da05f9f69db.jpg)
- జైపూర్-ఆగ్రా రహదారిపై ఘటన
- అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
- తెలియరాని మృతుడి వివరాలు
వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోని వ్యక్తి బయటపడేందుకు ప్రయత్నించాడు. అయితే, సెంట్రల్ లాక్ తెరుచుకోకపోవడంతో అతడు అందులో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన. కారు జైపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, కారు నంబరు ఆధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. సెంట్రల్ లాక్ తెరుచుకోకపోవడం వల్లే ఘోరం జరిగిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.