: జగన్ సీఎం అయితే ఏడు గంటల ఉచిత్ విద్యుత్: షర్మిల
జగన్ సీఎం అయితే వ్యవసాయానికి ఉచితంగా ఏడు గంటల విద్యుత్ ఇస్తాడని వైఎస్ షర్మిల అంటున్నారు. షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఈరోజు గంగారం వద్ద జరిగిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ, హామీల వర్షం కురిపించారు. అమ్మ ఒడి పథకం ద్వారా పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ వడ్డీ రహిత రుణాలు ఇచ్చేందుకు మొగ్గుచూపడంలేదని విమర్శించారు. అంతేగాకుండా, అధికారంలోకి వస్తే గ్రామాల్లో బెల్టు షాపులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.