oommen chandy: మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీపై లైంగిక వేధింపుల కేసు నమోదు

  • చాందీ, వేణుగోపాల్ లపై ఫిర్యాదు చేసిన సరితా నాయర్
  • తన పట్ల అభ్యంతరకర రీతిలో ప్రవర్తించారంటూ ఫిర్యాదు
  • సోలార్ కుంభకోణంలో నిందితురాలు సరితా

మహిళలపై లైంగిక వేధింపుల అంశం ప్రస్తుతం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులకు మీటూ ఉద్యమం సెగ తగిలింది. తాజాగా, కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమన్ చాందీపై ఆ రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ లైంగిక వేధింపుల కేసును నమోదు చేసింది. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పై కూడా కేసు నమోదైంది.

సోలార్ కుంభకోణంలో నిందితురాలైన సరితా నాయర్ వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు. తన పట్ల అభ్యంతరకర రీతిలో ప్రవర్తించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఒక స్పెషల్ టీమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే చాందీ, వేణుగోపాల్ లపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.

oommen chandy
kc venugopal
saritha nair
solar scam
case
sexual misconduct
kerala
crime branch
congress
  • Loading...

More Telugu News