Vice President: బెల్జియంలో శరవణ భవన్... దోసె తింటూ అద్భుతమన్న వెంకయ్యనాయుడు!

  • మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన వెంకయ్య
  • భారత రాయబారితో కలసి ఇండియన్ రెస్టారెంట్ కు
  • రుచి బాగుందని కితాబిచ్చిన ఉప రాష్ట్రపతి

మూడు రోజుల పర్యటన నిమిత్తం బెల్జియం వెళ్లిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బ్రసెల్స్ లోని 'శరవణ భవన్' హోటల్ కు వెళ్లి, భారత ఆహారాన్ని ఇష్టంగా తిన్నారు. బెల్జియంలో భారత రాయబారిగా వున్న గాయత్రి కుమార్ ఇస్సార్, ఇతర అధికారులతో హోటల్ కు వచ్చిన ఆయన, క్రిస్పీ దోసెను ఆర్డర్ చేసి, రుచి అద్భుతమని పొగిడారు. 12వ ఆసియా-ఐరోపా సదస్సులో పాల్గొనేందుకు వెంకయ్యనాయుడు బ్రసెల్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా వెంకయ్య, ఇప్పటికే పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యారు. గ్రీస్‌ ప్రధాని అలెక్సిస్‌ సైప్రస్‌, పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియో కోస్టా, బెల్జియం రాజు ఫిలిప్ ను ఆయన కలిశారు. యూరప్ దేశాలతో భారత్ మెరుగైన ఆర్థిక సంబంధాలు కలిగుండాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

Vice President
Venkaiah Naidu
Beljium
SaravanaBhavan
Dosa
  • Error fetching data: Network response was not ok

More Telugu News