Ramgopal Varma: ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు... నేను నిజం మాత్రమే చెబుతా: రామ్ గోపాల్ వర్మ

  • ఎన్టీఆర్ జీవితంలో శూన్యం ఏర్పడిన వేళ లక్ష్మీ పార్వతి ప్రవేశం
  • ఓదార్పును కోరుకుంటున్న భావోద్వేగ సమయమది
  • అయితే, అది నా అభిప్రాయమేనన్న రామ్ గోపాల్ వర్మ

దివంగత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవమేనని, అయితే, అది తన అభిప్రాయమని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. తాను నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నిజం మాత్రమే చెప్పాలని భావిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన, ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని పరిస్థితుల కారణంగా ఓ రకమైన శూన్యం ఏర్పడిన వేళ, లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించారని, ఆ సమయంలో ఓదార్పును కోరుకుంటున్న మానసిక పరిస్థితుల్లో ఉన్న ఎన్టీఆర్, ఆమెను ఆహ్వానించారని వర్మ వ్యాఖ్యానించారు. ఓ భావోద్వేగ సమయంలో ఇది జరిగి ఉంటుందని తాను అభిప్రాయపడుతున్నానని అన్నారు. సమాజంలో ఎవరో ఏదో అన్నారని, తాను గుడ్డిగా పాటించే రకాన్ని కాదని, తనకు కళ్లున్నాయని చెప్పిన వర్మ, పెళ్లయిన తరువాతే జ్ఞానోదయం అయిందని చెప్పారు.

Ramgopal Varma
Lakshmi's NTR
NTR
Lakshmi Parvati
  • Loading...

More Telugu News