Boy: సరదాగా రాంగ్ కాల్ చేస్తే... 15 ఏళ్ల బాలుడి జీవితం అతలాకుతలం!

  • బోర్ కొడుతోందని ఏదో నంబర్ కు కాల్ చేసిన బాలుడు
  • మహిళ గొంతు వినపడటంతో ప్రేమలోకి
  • తీరా ఆమె చెప్పిన అడ్రస్ కు వెళితే కనిపించిన 60 ఏళ్ల మహిళ
  • బలవంతంగా పెళ్లి జరిపించిన మహిళ బంధుమిత్రులు

బోర్ కొడుతోందని ఓ 15 ఏళ్ల బాలుడు చేసిన ఓ ఫోన్ కాల్ అతని జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఏకంగా 60 ఏళ్లున్న మహిళతో అతనికి వివాహమయ్యేలా చేసింది. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, తన చదువును మధ్యలో మానేసిన ఓ బాలుడు, సరదాగా రాంగ్ కాల్ చేయగా, ఓ మహిళ లిఫ్ట్ చేసింది. అవతలి వైపు నుంచి ఆడగొంతు వినగానే, మైమరచిపోయిన బాలుడు, ఫోన్ పరిచయాన్ని పెంచుకున్నాడు. వారి మధ్య మాటలు కోటలు దాటి, ప్రేమ దిశగా సాగిపోయాయి. ఒకరి వయసును మరొకరు ఎన్నడూ అడగలేదు, తెలుసుకోలేదు. ఇక ఇద్దరమూ కలసే వుండాలని నిర్ణయించుకున్న తరువాత, ఆ బాలుడికి తన అడ్రస్ చెప్పి, రావాలని కోరిందా మహిళ.

దీంతో బార్ పేట జిల్లాలోని సుఖావాజార్ కు అతను వెళ్లి, ఆమెను చూసి అవాక్కయ్యాడు. ఆమె 60 ఏళ్లున్న ముసలామె కావడమే ఇందుకు కారణం. సదరు యువకుడికి మైండ్ బ్లాంక్ అయిపోగా, ఆమె చెప్పిన మాటలు విన్న స్థానికులు, మహిళ బంధుమిత్రులు, ఆ యువకుడితో బలవంతంగా పెళ్లి జరిపించేశారు. తనకు ఇష్టం లేకుండా ఈ పెళ్లిని చేశారని, ఆమె వయసు 60 ఏళ్లన్న సంగతి తనకు తెలియదని అతను మొత్తుకున్నా ఎవరూ వినలేదు.

జరిగిన ఘటన మీడియాలో వైరల్ కాగా, బాలల హక్కుల కమిషన్ స్పందించింది. విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ఇప్పటివరకూ తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదన్న గోల్ పడా డిప్యూటీ కమిషనర్ వార్నాలి డెకా, ఎవరైనా కంప్లయింట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News