gangula kamalakar: చంపుతానంటూ బెదిరింపులు.. టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పై కేసు నమోదు

  • కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు బెదిరింపులు
  • రాజకీయం పక్కన పెడితే వేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదంటూ వార్నింగ్
  • ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు సంయమనం పాటిస్తున్నానంటూ వ్యాఖ్య

కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ను మీడియా సమావేశంలో బహిరంగంగా బెదిరించిన ఘటనలో కేసు నమోదైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే, బండి సంజయ్ ను చంపుతానంటూ కమలాకర్ బెదిరించారు.

'బిడ్డా రాజకీయం పక్కన పెడితే నిన్ను వేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు ఏమనుకుంటున్నావో' అంటూ కమలాకర్ బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని... అందుకే సంయమనంతో ఉన్నానని చెప్పారు. అనవసరంగా తనను కెలికితే నీ సంగతి చూస్తానంటూ హెచ్చరించారు. 'రాజకీయాలను పక్కన పెడితే నీవు ఔటే' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

gangula kamalakar
bandi sanjay
death
warning
case
TRS
bjp
karimnagar
  • Loading...

More Telugu News