rahul gandhi: ఇప్పుడు దేశంలో రెండు అంశాలపై వివాదం రేగుతోంది: రాహుల్ గాంధీ
- కొందరు దేశాన్ని విభజించు, పాలించు అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారు
- మరికొందరు దేశ ప్రజలందరినీ ఏకం చేయాలని యత్నిస్తున్నారు
- దేశ ప్రజలను ఏకతాటిపై నడిపించేది కాంగ్రెస్ మాత్రమే
ఈ దేశం ఏ ఒక్కరిదో కాదని చెప్పడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పుడు దేశంలో రెండు అంశాలపై వివాదం రేగుతోందని... కొందరు దేశాన్ని విభజించు, పాలించు అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారని... ఇంకొందరు దేశ ప్రజలందరినీ ఏకం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఇప్పుడు కొందరు నీ కులం ఏమిటి? నీ మతం ఏమిటి? అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల, మతాలకు అతీతంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఘనత భారతీయులదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలందరికీ సమాన హక్కులు ఉండేలా రాజ్యాంగాన్ని రాసుకున్నామని తెలిపారు. దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. చార్మినార్ వద్ద నిర్వహించన సభలో ప్రసంగిస్తూ, రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు.