Srikakulam District: యువకుడిని ఢీకొన్న పవన్ కల్యాణ్ కాన్వాయ్.. ఆగ్రహంతో వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు!

  • శ్రీకాకుళం జిల్లా బోరుభద్ర గ్రామంలో ఘటన
  • కాలును తొక్కించుకుంటూ వెళ్లిన జనసేన కారు
  • చివరికి నేతల హామీతో మెత్తబడ్డ గ్రామస్తులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి ప్రాంతంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న బోరుభద్ర గ్రామం వద్ద పవన్ కాన్వాయ్ తేజ అనే యువకుడిని ఢీకొంది. ఈ సందర్భంగా కాన్వాయ్ లోని ఓ కారు యువకుడి కాలు మీదుగా వెళ్లడంతో అతను నొప్పితో విల్లవిల్లాడిపోయాడు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు జనసేన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అనంతరం తేజను మండలంలోని ప్రాథమిక ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు, సీఐ నవీన్ కుమార్ తేజను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తీసుకువెళతామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో చివరికి తేజను జనసేన నాయకులు తమ వాహనంలో శ్రీకాకుళం తరలించారు.

Srikakulam District
Pawan Kalyan
Jana Sena
Road Accident
car
youth
  • Loading...

More Telugu News