CPM leader yadayya died: సీపీఎం తెలంగాణ నేత యాదయ్య గుండెపోటుతో మృతి

  • రెండున్నర దశాబ్దాలుగా పార్టీకి సేవలు
  • మూడేళ్లపాటు మండల సహకార సంఘం డైరెక్టర్‌గా బాధ్యతలు
  • యాదయ్యకు పలువురు నేతల నివాళి

దాదాపు ఇరవై ఐదేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న సీపీఎం సీనియర్‌ నాయకుడు ఎ.యాదయ్య గుండెపోటుతో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన యాదయ్య తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారం ఉదయం హఠాత్తుగా ఆయనకు సుస్తీ చేయగా అక్కడికక్కడే కన్నుమూశారు. యాదయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, మస్కు నర్సింహులుతోపాటు సీపీఎం నాయకులు పి.జంగారెడ్డి, బి.మధుసూదన్‌రెడ్డి, పి.యాదయ్యయాదవ్‌, సీపీఎం మండల కార్యదర్శి పి.బ్రహ్మయ్య, పి.అంజయ్య తదితరులు యాదయ్య మృతదేహంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. యాదయ్య మూడేళ్లపాటు మండల సహకార సంఘం డైరెక్టర్‌గా పనిచేసి రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు.

CPM leader yadayya died
rangareddy district
yacharam
  • Loading...

More Telugu News