paripoornananda: కర్మయోగిగా బీజేపీలో చేరా: పరిపూర్ణానంద స్వామి

  • అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన పరిపూర్ణానంద
  • అంతకు ముందు రాంమాధవ్ తో చర్చలు
  • దక్షిణాదిన పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం స్వామి మీడియాతో మాట్లాడుతూ, ఒక కర్మయోగిగా బీజేపీలో చేరానని చెప్పారు. అంతకు ముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో పరిపూర్ణానంద భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్టు సమాచారం. మరోవైపు, దక్షిణాదిన పార్టీ ప్రచార బాధ్యతలను స్వామికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది.

paripoornananda
bjp
join
amit shah
  • Loading...

More Telugu News