nanapatekar: తనుశ్రీ దత్తాపై చట్టపరమైన చర్యలు...లైంగిక ఆరోపణలపై స్పందించిన నానాపటేకర్‌

  • అవి పూర్తిగా నిరాధార, తప్పుడు ఆరోపణలు
  • సీఐఎన్‌టీఏఏ నోటీసులకు స్పందించిన నానా
  • పదేళ్ల క్రితం తనపట్ల నానాపటేకర్‌ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన తనుశ్రీ

‘ఎప్పుడో ఏదో జరిగిందని తనుశ్రీదత్తా కట్టుకథ అల్లింది. అవి పూర్తిగా నిరాధార తప్పుడు ఆరోపణలు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’...అని బాలీవుడ్‌ నటుడు నానాపటేకర్‌ వివరణ ఇచ్చారు. మీటూ ఉద్యమ స్ఫూర్తితో తనుశ్రీ, పదేళ్ల క్రితం నానా వేధించాడంటూ అప్పటి విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా నానా పటేకర్‌ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ బాలీవుడ్‌ బ్యూటీ తనుశ్రీ దత్తా ఆరోపించింది. ఈ ఆరోపణలపై తనుశ్రీకి పరిణితీ చోప్రా, ప్రియాంక చోప్రా, ట్వింకిల్‌ ఖన్నా, శిల్పాశెట్టి, డింపుల్‌ కపాడియా, ఫర్హాన్‌ అక్తర్‌ మద్దతుగా నిలిచారు. కాగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ నానాపటేకర్‌కు సీఐఎన్‌టీఏఏ (సినీ, టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్) నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు వివరణ పంపిన నానాపటేకర్‌ తనుశ్రీవి తప్పుడు ఆరోపణలుగా పేర్కొంటూ లీగల్‌ నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు.

nanapatekar
tanusridatta
sexual herasment
  • Loading...

More Telugu News