Rehna Fatima: శబరిమలకు వెళ్లిన యువతి ఇంటిని సర్వనాశనం చేసిన నిరసనకారులు!

  • ఈ ఉదయం వార్తలు చూసిన తరువాత ప్రజల్లో ఆగ్రహం
  • ఎర్నాకులంలోని రెహ్నా ఇంటిని ధ్వంసం చేసిన ఆందోళనకారులు
  • పోలీసులు వచ్చేలోపే గృహోపకరణాలన్నీ ధ్వంసం

శబరిమలలో అయ్యప్ప దర్శనానికి వెళ్లిన యువతి ఇంటిని నిరసనకారులు సర్వనాశనం చేశారు. వందలాది మంది నిరసనకారులు, ముఖ్యంగా మహిళలు, ఎర్నాకులంలోని రెహ్నా ఫాతిమా ఇంటిపై పడి, బీభత్సం చేసినట్టు తెలుస్తోంది. తాను శబరిమలకు వెళుతున్నానని సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ కావడం, ఆపై పోలీసు బందోబస్తు మధ్య ఆమె ఆలయం దగ్గరికి వెళ్లినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో వందలాది మంది ఆ ఇంటిని చుట్టుముట్టి ధ్వంసం చేశారు. ఇంట్లోని వారందరినీ బయటకు గెంటేశారు. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి వచ్చేలోపే, గృహోపకరణాలన్నీ ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు రెహ్నా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

Rehna Fatima
News
Kerala
Ernakulam
police
House Damage
  • Loading...

More Telugu News