Petrol: ఇంకొంచెం తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు!

  • వరుసగా రెండో రోజూ తగ్గిన 'పెట్రో' ధరలు
  • లీటరు పెట్రోలుపై 24 పైసల తగ్గుదల
  • 10 పైసలు తగ్గిన డీజిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాల కారణంగా ముడిచమురు ధరలు తిరోగమన బాటన నడుస్తుండటంతో, ఆ ప్రభావం దేశవాళీ పెట్రోల్, డీజిల్ ధరలపైనా పడింది. వరుసగా రెండో రోజూ 'పెట్రో' ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. లీటరు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్ పై 10 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ మార్పు తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 82.38కి, డీజిల్ ధర రూ. 75.48కి చేరగా, ముంబైలో పెట్రోలు ధర రూ. 87.74కు డీజిల్ ధర రూ. 79.13కు తగ్గింది.

Petrol
Diesel
Price Slash
Crude Oil
  • Loading...

More Telugu News