Lakshmi Parvati: రామ్ గోపాల్ వర్మను కలిసిన లక్ష్మీపార్వతి!

  • ఈ ఉదయం వర్మను కలిసిన లక్ష్మీపార్వతి
  • సందేశాత్మకంగా చిత్రం తీయాలని కోరిన ఎన్టీఆర్ సతీమణి
  • జగన్ ను సీఎం చేసేందుకు కృషి చేస్తానన్న మహిళా నేత

తన భర్త, దివంగత ఎన్టీఆర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఈ ఉదయం లక్ష్మీ పార్వతి కలుసుకున్నారు. సందేశాత్మకంగా ఈ చిత్రం ఉండేలా చూడాలని తాను ఆయన్ను కోరానని లక్ష్మీపార్వతి మీడియాకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోనని, ఇదే సమయంలో జగన్ ను సీఎం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తాను రాష్ట్రమంతా ప్రచారం సాగించనున్నానని చెప్పారు. వర్మ తీస్తున్న చిత్రం తనను అగౌరవపరిచే విధంగా ఉండదనే నమ్ముతున్నానని, అసలు వాస్తవాన్ని మాత్రమే చెప్పాలని తాను కోరగా, వర్మ అంగీకరించారని అన్నారు. ఆ మహానుభావుడి చరిత్రను, చివరి రోజుల్లో జరిగిన నిజాన్ని ప్రజలకు చెప్పాలని 22 సంవత్సరాలుగా ఎదురుచూశానని, ఇంతకాలానికి వర్మ ముందుకు రావడం సంతోషకరమని ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి అన్నారు. 

Lakshmi Parvati
Ramgopal Varma
Lakshmi's NTR
Jagan
  • Loading...

More Telugu News