income tax rides: ఐటీ దాడుల్లో.. చాట్‌వాలా ఇంట్లో రూ.1.2 కోట్లు స్వాధీనం!

  • పకోడీ విక్రేత ఇంట్లో రూ.60 లక్షలు
  • దిగ్భ్రమకు గురైన అధికారులు
  • లెక్కల్లేని మొత్తం స్వాధీనం

కొందరు వ్యాపారుల ఆదాయం చూసి ఆదాయ పన్ను శాఖ అధికారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సాధారణంగా పకోడీ అమ్ముకునే వాళ్లు, చాట్‌వాలాల వద్ద ఏం డబ్బుంటుందిలే అనుకుంటాం. బతుకుదెరువు కోసం ఏదో వ్యాపారం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని భావిస్తాం. కానీ లూథియానా, పాటియాలాలలో దాడులు నిర్వహించిన ఐటీ అధికారులకు నమ్మలేని వాస్తవాలు కళ్లముందు కనిపించాయి.

పది రోజుల క్రితం లూథియానాలోని పకోడీ విక్రేత ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులు రూ.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీంతోనే షాక్‌ తిన్న అధికారులకు పాటియాలాలో దాడులు చేసినప్పుడు మరింత షాక్‌ తగిలింది. నగరంలోని ఓ పేరొందిన చాట్‌ వాలా వద్ద ఏకంగా రూ.1.2 కోట్లు గుర్తించారు. ఈ మొత్తానికి దేనికీ చాట్‌వాలా వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు చాట్‌వాలా పెద్దపెద్ద వివాహాలకు ఆర్డర్లు తీసుకోవడంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడని ఐటీ అధికారుల తనిఖీల్లో తేలింది.

  • Loading...

More Telugu News