Telangana: జగిత్యాలకు వెళుతున్న టీడీపీ నేత వల్లభనేని అనిల్ కారు డ్రైవర్ నుంచి రూ. 60 లక్షలు పట్టివేత!

  • జగిత్యాలకు తరలుతున్న డబ్బు
  • కారులో తీసుకెళుతుండగా పట్టుకున్న సెంట్రల్ జోన్ పోలీసులు
  • డబ్బు ఎక్కడిదన్న విషయమై ఆరా

హైదరాబాద్ నుంచి జగిత్యాలకు తరలిస్తున్న రూ. 60 లక్షల డబ్బును సెంట్రల్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ, ఇంతమొత్తం డబ్బు పట్టుబడటం కలకలం రేపుతోంది. తెలుగు యువత ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత వల్లభనేని అనిల్ కు చెందిన కారులో డ్రైవర్ మహేష్ ఈ డబ్బును తీసుకెళుతూ పట్టుబడ్డాడు.

మహేష్ తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ డబ్బు ఎక్కడిదన్న విషయమై ఆరా తీస్తున్నారు. పలు కోణాల్లో విచారిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం ఈ డబ్బును తీసుకెళుతున్నారా? లేక మరేదైనా అవసరం నిమిత్తం తీసుకు వెళుతున్నారా? అన్న విషయం ఇంకా తేలాల్సి వుందని  చెప్పారు.

Telangana
Cash
Vallabhaneni anil
Car Driver
Jagityala
  • Loading...

More Telugu News